డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పెంచింది. అయితే, పెట్రోల్‌పై సుంకాన్ని మాత్రం పూర్తిగా సున్నాకు తగ్గించడం గమనార్హం. ఈ నిర్ణయాలు రెండు వారాల పాటు అమల్లో ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
తాజా సవరణతో డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రేటు గతంలో లీటరుకు రూ.8.5 ఉండగా, దానిని ఇప్పుడు రూ.11.5కు కేంద్రం పెంచింది. అదేవిధంగా విమాన ఇంధనం ఎగుమతులపై లీటర్‌కు ఈ పన్నును రూ.10.5 నుంచి రూ.11కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు పెట్రోల్ ఎగుమతులపై ఇప్పటివరకు లీటరుకు రూ.2.5గా ఉన్న ట్యాక్స్‌ను తాజాగా సున్నాకు తగ్గించారు. దేశీయంగా వినియోగిస్తున్న డీజిల్, పెట్రోల్‌పై ప్రస్తుతం అమలులో ఉన్న సుంకాల రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని అధికారులు తెలిపారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా ఇంధన లభ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం గతంలో ఈ విండ్‌ఫాల్ పన్ను విధానాన్ని తీసుకువచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పక్షం రోజులకోసారి ఈ సుంకాల రేట్లను సవరిస్తూ వస్తున్నారు.
Don’t receive OTP? Resend