ఆంధ్రప్రదేశ్లో వైసిపి నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద కేసులో కుమారుడిని తప్పించేందుకు కుట్ర చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఈ చర్యలు చేపట్టారు. అరెస్ట్ సందర్భంగా ఆయన ఇంటి వద్దకు కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Don’t receive OTP? Resend