గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెనాలి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెనాలి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు డాక్టర్ దక్షిణామూర్తి దశాబ్దాలుగా వైద్య సేవలు అందించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 1973 సంవత్సరం నుంచి గీతా నర్సింగ్ హోమ్ పేరుతో ఆసుపత్రిని నిర్వహిస్తూ వస్తున్నారు. వైద్య వృత్తిలో ఆయన అందించిన నిస్వార్థ సేవలను స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు.
ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు వైద్యులు, ప్రముఖులు, స్థానిక నివాసులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెనాలిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Don’t receive OTP? Resend