దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగి బ్యారెల్ 112 డాలర్లకు చేరడంతో ద్రవ్యోల్బణ భయాలు నెలకొన్నాయి. ఈ పరిణామాల ప్రభావం నేరుగా ఈక్విటీ మార్కెట్లపై పడడంతో సూచీలు రోజంతా నష్టాల బాటలోనే పయనించాయి.
సెన్సెక్స్ ఉదయం 73,343.33 పాయింట్ల వద్ద నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించింది. రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ఇంట్రాడేలో 73,005.11 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరికి సెన్సెక్స్ 460.30 పాయింట్ల నష్టంతో 73,249.39 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 123.70 పాయింట్లు కోల్పోయి 22,687.65 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 94.82 వద్ద కొనసాగింది.
సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ట్రెంట్ షేర్లు నష్టాలను చవిచూశాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, ఎస్బీఐ షేర్లు లాభాల బాటలో పయనించి సూచీల పతనాన్ని కొంతవరకు అడ్డుకున్నాయి.
Don’t receive OTP? Resend