షూటింగ్లో బాలకృష్ణకు స్వల్ప గాయం
కాకినాడ పోర్టులో జరుగుతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్లో నటుడు నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయమైంది. ఫైట్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన మోకాలికి గాయం అయినట్లు సమాచారం. అనంతరం కాకినాడ పోర్టులోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది. గాయం స్వల్పమేనని చిత్రబృందం వర్గాలు వెల్లడించాయి.
Login
Comments (0)