ఆంధ్రప్రదేశ్‌లో వెంకటేశ్ కథానాయకుడిగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. చిత్ర యూనిట్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.
పెంచిన ధరల వివరాలు
ఈ చిత్రానికి సంబంధించి మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి టికెట్ ధరపై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సాధారణ ధరలతో పాటు ఈ పెంపు వర్తించనుంది. సినిమా విడుదలైన నాటి నుంచి పది రోజుల పాటు ఈ పెంచిన ధరలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఐదు షోల ప్రదర్శనకు వెసులుబాటు
టికెట్ ధరల పెంపుతో పాటు సినిమా ప్రదర్శనల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ షోలతో పాటు అదనంగా మరో షోను కలుపుకుని రోజుకు మొత్తం ఐదు ప్రదర్శనలు వేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. శ్రీనిధిశెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రం అక్టోబరు 30న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది.
Don’t receive OTP? Resend