ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ షో స్టాపర్స్ సంచిక కవర్ పేజీపై మెరిసిన టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, ఆ ఫొటోషూట్ తాలూకు తెర వెనుక విశేషాలతో కూడిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
పుష్ప సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో అసాధారణ క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
భారతదేశంలో వివిధ రంగాల నుంచి అత్యంత ప్రభావం చూపుతున్న వంద మంది ప్రముఖులు, వారి బ్రాండ్ విలువ, ప్రజాదరణ ఆధారంగా ఫోర్బ్స్ ఇండియా ఈ ప్రత్యేక సంచికను రూపొందించింది. ఈ జాబితాలో అల్లు అర్జున్ అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఈ సందర్భంగా జరిగిన ఫొటోషూట్ తాలూకు ఆసక్తికర దృశ్యాలను, అనుభవాలను ఈ వీడియోలో హైలైట్ చేశారు.
Don’t receive OTP? Resend