2024 సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేసిన కూటమి ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జనసేనకు బలం ఉన్న చోట్ల తప్పకుండా పోటీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గత ఎన్నికల్లో వెనక్కి తగ్గామని, స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
Don’t receive OTP? Resend