బంగ్లాదేశ్ లో మరొక హిందూ పౌరుడి సజీవ దహనం
బంగ్లాదేశ్ లో మరో భయానక ఘటన చోటు చేసుకొంది. దుకాణంలో నిద్రిస్తున్న ఓ హిందూ యువకుడిని సజీవ దహనం చేశారు. ఈ ఘటన నార్సింగ్డి ప్రాంతంలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఓ దుకాణంపై అల్లరి మూకలు దాడి చేశాయి. షట్టర్ మూసివేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించాయి. ఈ సమయంలో షాపులో నిద్రిస్తున్న చంచల్ భౌమిక్ (23) అనే యువకుడు సజీవదహనం అయ్యాడు. చంచల్ మరణించాడని నిర్ధరించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Login
Comments (0)