సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పార్కింగ్ సూచనలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నందున ప్రయాణీకులకు పార్కింగ్ స్థలాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కేవలం పికప్ , డ్రాప్ లను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 వైపు ప్రవేశించే ప్రయాణీకులకు 15 నిమిషాల వరకు ఉచిత పికప్, డ్రాప్ సౌకర్యం ఉంటుంది. రైళ్లు ఎక్కడానికి, ప్రయాణికుల రాకపోకలకోసం, పార్కింగ్ కోసం ప్లాట్‌ఫామ్ నెం. 10 వైపున ఉన్న బేస్మెంట్లో వాహనాలకు తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
Login
Comments (0)