నీటి పైప్ లైన్ పగిలి మునిగిపోయిన మణికొండ కాలనీలు
హైదరాబాద్: మణికొండలో భారీ పైప్లైన్ పగిలి పలు కాలనీల్లోకి పెద్ద ఎత్తున వరద చేరింది. సింగూరు నుంచి హైదరాబాద్కు తాగునీటిని తీసుకువచ్చే పైప్ లైన్ మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో పగిలిపోయింది. దీంతో ఎంప్లాయిస్ కాలనీ, శివసాయి కాలనీల్లోకి పలు అపార్ట్మెంట్ల సెల్లార్లు వరద నీటితో నిండిపోయాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది, మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Login
Comments (0)