అగ్ర కథానాయిక సమంతకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా గోద్ భరాయి, అంటే సీమంత వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. భారతీయ సంప్రదాయాలంటే తనకెల్లప్పుడూ ఎంతో గౌరవమని, ప్రతి ఆచారం వెనుక ఒక బలమైన శక్తి, అంతర్లీనమైన అర్థం ఉంటుందని ఈ సందర్భంగా సమంత పేర్కొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ శ్రీవిద్య ఉపాసనకు సంబంధించిన విశేషాలను ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘంగా వివరించారు.
శ్రీకల్పం అనబడే కళావరణం అనేది శ్రీవిద్య సంప్రదాయానికి చెందిన ఒక విశిష్టమైన క్రతువు అని సమంత తెలిపారు. శ్రీవిద్య ఉపాసకులు మంత్రోచ్ఛారణ చేస్తూ పవిత్ర జలంతో గర్భిణి అయిన మహిళకు అభిషేకం చేస్తారని, దీని ద్వారా అమ్మవారి దివ్య గుణాలు ఆ మహిళలో చైతన్యం నింపుతాయని వివరించారు. సృష్టికర్తగా మారుతున్న తల్లిని గౌరవించడం, గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆశీర్వాదం అందించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
అభిషేకం పూర్తయిన తర్వాత తల్లి కాబోతున్న మహిళను శ్రీచక్ర యంత్రంలో కూర్చుండబెడతారని సమంత పేర్కొన్నారు. దేవీ ఖడ్గమాల పారాయణ, మంత్ర జపం మనస్సును అంతర్ముఖం చేస్తాయని, ఈ మంత్రోచ్ఛారణ కారణంగా తల్లీ బిడ్డలకు ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని తమ నమ్మకమని తెలిపారు. ఈ దివ్య అనుభూతి ఎంతో శక్తిమంతంగా అనిపించిందని ఆమె భావోద్వేగంతో పంచుకున్నారు.
భూతశుద్ధి పద్ధతిలో రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత జీవితంలో ఈ సీమంత వేడుక మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. ఈ వేడుకలో ఆమె భర్త రాజ్ నిడిమోరు ప్రత్యేకంగా ఆశీర్వాదాలు అందించారు. అలాగే స్నేహితురాలు శిల్పతో పాటు మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య, ప్రముఖులు నీరజా కోన, నజ్రియా తదితరులు సామ్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
Don’t receive OTP? Resend