అమరావతి: వైసీపీలో ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవుల కోసం జగన్‌ను ఆకట్టుకునేందుకు ఎంతమంది నాయకులు మతం మార్చుకున్నారో పార్టీ అగ్ర నాయకత్వం సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.
2024 ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి క్రైస్తవ సభలో మాట్లాడినట్లుగా ఉన్న వీడియోను ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. అందులో క్రైస్తవులులు స్వేచ్ఛగా ప్రార్థనలు చేసుకోవాలంటే జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ద్వారంపూడి వ్యాఖ్యానించినట్లు ఉంది.
‘140 రోజుల తర్వాత మనకు ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. అది జగన్ కావాలని నా కోరిక. ముఖ్యమంత్రిగా జగన్ ఉంటే మనం ఎంత బలంగా ఉండవచ్చో వేదిక మీదున్న పెద్దలందరికీ తెలుసు. గత ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాంతంలో ఇటువంటి సభలు పెట్టుకోవాలంటే ఎన్ని బాధలు పడేవారో ఇక్కడున్న పాస్టర్ పెద్దలకు తెలుసు.
'గతంలో ఎమ్మెల్యేలకు లంచాలిస్తే తప్ప సభ జరిగేది కాదు. అందుకనే మన సభలు బాగా జరగాలన్నా, మన దేవుడిని బాగా ప్రార్థించుకోవాలన్నా, మనం స్వేచ్ఛగా ఉండాలన్నా క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్ మరలా పీఠం మీదకు రావాలి. దానికి మీరంతా దీవించాలి.. ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా’ అని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
Don’t receive OTP? Resend