విజయవాడ: డీఎస్సీ-2025 టీచర్లు విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు వేలాదిమంది ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి టీచర్లు పాల్గొన్నారు. డీఎస్సీ ఉద్యోగాలు సాధించిన తమను వైసిపి అవమానిస్తోందని ఆరోపించారు. మెగా డీఎస్సీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
Don’t receive OTP? Resend