యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం కింగ్స్ కాలేజీలో జరిగిన కేంబ్రిడ్జ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సింపోజియంలో విజయవాడ బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి నరేన్ తుమ్మల భారత్కు ప్రాతినిధ్యం వహించారు. భారత్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిగా ఆయన "క్వాంటమ్ కంప్యూటింగ్: నాయిస్ అండ్ ఎరర్-కరెక్టింగ్ కోడ్స్"పై పరిశోధన పత్రాన్ని 2017 నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతి గ్రహీత డాక్టర్ బారీ సి. బారిష్ సమక్షంలో సమర్పించారు.
Don’t receive OTP? Resend