అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 29 మంది ఉపాధ్యాయులు శనివారం ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు పొందిన వీరికి ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ, ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. టుర్కు యూనివర్సిటీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. టుర్కు, రౌమా నగరాల్లో పాఠశాలలను సందర్శించి, తరగతులను పరిశీలించి, విద్యావేత్తలతో ఉపాధ్యాయులు సమావేశం కానున్నారు.
Don’t receive OTP? Resend