మెగా డీఎస్సీ-2025 ఎంపికల్లో అవకతవకలు జరిగాయని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ఆరోపణలను నిరసిస్తూ కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు కడప, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఐదేళ్లపాటు కష్టపడి సిద్ధమై ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన తమను నిరాధార ఆరోపణలతో అవమానిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Don’t receive OTP? Resend