ఇక నుంచి అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం గీతాన్ని పూర్తి నిడివిలో (3 నిమిషాల 10 సెకన్లు) బంకించంద్ర ఛటర్జీ రచించిన ఆరు చరణాల పూర్తి రూపాన్నే ఆలాపించాలి
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చారిత్రక పరిణామం చోటుచేసుకోనుంది. ఆగస్టు 15న ఎర్రకోట బురుజుల నుంచి తొలిసారిగా వందేమాతరం ఆలపించనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతానికి ముందు వందేమాతరం ఆలపించనున్నారు.
ఎర్రకోట వేడుకలకు హాజరయ్యే 27,000 మందికి పైగా ప్రముఖులు, సందర్శకులు, విద్యార్థులు వందేమాతరం ఆలాపన సమయంలో నిలబడి గౌరవం పాటించాల్సి ఉంటుందని రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు.
వందేమాతరం గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు; బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ఆరు చరణాలతో పూర్తి వందేమాతరం
వందేమాతరం విషయంలో కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జనవరి 28న కొత్త అధికారిక ప్రోటోకాల్‌ను జారీ చేసింది. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఆరు చరణాల పూర్తి రూపాన్నే అధికారిక కార్యక్రమాల్లో ఉపయోగించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీని పూర్తి నిడివి 3 నిమిషాల 10 సెకన్లు.
ఇప్పటివరకు ఆకాశవాణి సహా పలు సందర్భాల్లో సాధారణంగా వినిపించిన రెండు చరణాల రూపానికి బదులుగా, ఆరు చరణాల పూర్తి రూపాన్ని అధికారికంగా ప్రోత్సహిస్తున్నారు. ఆకాశవాణి 2026 మార్చి 26 నుంచి ఆరు చరణాల కొత్త వెర్షన్‌ను ప్రసారం చేయడం ప్రారంభించింది.
ఎక్కడ పూర్తి రూపంలో ఆలపించాలి?
హోంశాఖ ప్రోటోకాల్ ప్రకారం వందేమాతరం పూర్తి రూపాన్ని ముఖ్యమైన అధికారిక కార్యక్రమాల్లో ఆలపించాలి. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, రాష్ట్రపతి లేదా గవర్నర్ రాక, జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమాలు వంటి సందర్భాలు ఇందులో ఉన్నాయి. జాతీయ గీతం, జాతీయ గేయం రెండూ ఒకే కార్యక్రమంలో ఉంటే ముందుగా వందేమాతరం, ఆ తర్వాత జనగణమన ఆలపించాలి.
పాఠశాలలు, సామూహిక కార్యక్రమాలకు సంబంధించి కూడా కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ మార్గదర్శకాలు మరియు కొత్త క్రిమినల్ చట్టం రెండింటినీ వేర్వేరు అంశాలుగా చూడాలి. ప్రోటోకాల్ ఒకటి; చట్టపరమైన శిక్షా నిబంధన మరొకటి.
గౌరవం పాటించేందుకు నిలబడాలి
హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వందేమాతరం ఆలపించే సమయంలో సభలోని వారు అటెన్షన్లో నిలబడాలి. వందేమాతరం, జనగణమన రెండూ ఉన్న కార్యక్రమాల్లో మొదట వందేమాతరం, తర్వాత జాతీయ గీతం ఉంటుంది.
Don’t receive OTP? Resend