న్యూఢిల్లీ: అధికారిక కార్యక్రమాల్లో ‘వందే మాతరం’, జాతీయ గీతం రెండింటినీ ఆలపించే సందర్భాల్లో ముందుగా ‘వందే మాతరం’నే ఆలపించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని జులై 9న పంపిన లేఖలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అరవింద్ ఖరే స్పష్టం చేశారు.
Don’t receive OTP? Resend