న్యూఢిల్లీ: దేశంలో సాయుధ నక్సలిజాన్ని నిర్మూలించినా మేధో నక్సలిజం ఇంకా పొంచి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. మావోయిస్టు భావజాలం ఉన్నవారు గతంలో విధాన నిర్ణయాలను ప్రభావితం చేశారని తెలిపారు. మేధో నక్సలైట్లను గుర్తించి ఏకాకులను చేయాలని, యువతను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
Don’t receive OTP? Resend