అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి దిలీప్ కుమార్ బుంగటావుల మృతి చెందారు. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో ఎదురుగా వచ్చిన పికప్ ట్రక్కు ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చిట్వేల్ మండలం జెట్టివారిపాలెంకు చెందిన దిలీప్ కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు.
Don’t receive OTP? Resend