న్యూజెర్సీ రోడ్డు ప్రమాదంలో వినుకొండ విద్యార్థిని మృతి
వినుకొండ: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్న (27) మృతి చెందారు. 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆమె ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా, ముగ్గురు స్నేహితులకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
Login
Comments (0)