వీపనగండ్ల: అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి (45) ఫ్లోరిడాలో నివాసముంటున్నారు. ఐటి ఉద్యోగి అయిన ఆయన వర్క్ ఫ్రం హోం చేస్తుండగా మంగళవారం అర్ధరాత్రి (భారత కాలమాన ప్రకారం) గుండెపోటుతో మరణించారు. గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. హర్షవర్ధన్ తండ్రి సుదర్శన్‌రెడ్డి బొల్లారం సర్పంచ్‌గా ఉన్నారు.
Don’t receive OTP? Resend