రాష్ట్రంలో పరిమితికి మించి ఉచిత పథకాలు అమలు చేయడం ప్రమాదకరమని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాగే కొనసాగితే కుబేరుడైనా పనికి ఆహారం పథకం కింద కూలి పనికి వెళ్లే పరిస్థితి వస్తుందని జస్టిస్ భీమపాక నగేష్ అన్నారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాల్లో 1.03 కోట్ల కుటుంబాలు ఉచిత పథకాల లబ్ధిదారులుగా ఉన్నాయని పేర్కొంటూ, దీర్ఘకాలంలో ఇది ఆచరణ సాధ్యం కాదని కంటోన్మెంట్ బోర్డు కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Don’t receive OTP? Resend