అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారంపై సిట్ దర్యాప్తు
అయోధ్య రామమందిరంలో విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం ఆలయ ప్రాంగణాన్ని సందర్శించింది. కేసుకు సంబంధించిన పత్రాలను సేకరించినట్లు సమాచారం. శ్రీరామ్ తీర్థక్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తితో సిట్ ఏర్పాటైంది. ప్రాథమిక నివేదికను ఏడు రోజుల్లో, తుది నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Login
Comments (0)