అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం తీరం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో పాటు, కెరటాల ఉద్ధృతికి సముద్రం ఏకంగా పది మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. తీర ప్రాంతంలో నెలకొన్న ఈ ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.
ప్రమాదాలను నివారించేందుకు రుషికొండ, ఆర్కే బీచ్లలోకి పర్యాటకుల ప్రవేశంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆయా ప్రముఖ బీచ్లను పూర్తిగా మూసివేశారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను పూర్తిగా తొలగిపోయే వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
Don’t receive OTP? Resend