రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ పెట్టుబడుల ప్రస్థానానికి అందరూ మద్దతుగా నిలిచారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమిట్‌కు అందరినీ ఆహ్వానించారు. ఈ మేరకు దిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో నిర్వహించిన సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని, సమిట్ లక్ష్యాలు, ప్రాధాన్యంపై మాట్లాడారు.ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉంది. 2034 నాటికి ''తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో మూడు హైదరాబాద్‌కు అనుసంధానం కానున్నాయి. హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్ -బెంగళూరు, హైదరాబాద్ -పుణె మార్గాల్లో ఈ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. వరంగల్, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరిస్తోంది. ఈ ప్రగతి ప్రస్థానంలో మీరూ భాగస్వాములు కండి," అని సిఎం పిలుపునిచ్చారు.
Don’t receive OTP? Resend