జులై 17న రాయనపాడు స్టేషన్ ప్రారంభం
అమరావతి: కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.35 కోట్లకు పైగా వ్యయంతో ఆధునికీకరించిన రాయనపాడు రైల్వే స్టేషన్‌ను జులై 17న ప్రారంభించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. విజయవాడ జంక్షన్‌పై రద్దీ తగ్గించేందుకు శాటిలైట్ టెర్మినల్‌గా ఈ స్టేషన్ పనిచేయనుండగా, రోజుకు 12 రైళ్లు, కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఇక్కడి నుంచి నడవనున్నాయి.
Login
Comments (0)