ఐడీబీఐ బ్యాంక్‌లో మెజార్టీ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌కు విక్రయించే ప్రతిపాదనపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో నిబంధనలు పాటించకుండా రాజకీయంగా పలుకుబడి ఉన్నవారికి అప్పులు ఇచ్చేలా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు.
మొండి బకాయిలతో తీవ్ర నష్టాలపాలైన ఐడీబీఐ బ్యాంక్‌ను దయనీయ స్థితిలో ఎన్డీయే ప్రభుత్వానికి అప్పగించారని నిర్మలమ్మ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మోదీ ప్రభుత్వం ముందుచూపు విధానాలతో రూ.25 వేల కోట్లకుపైగా మూలధనాన్ని సమీకరించి బ్యాంక్‌ను మళ్లీ గాడినపడేసిందని స్పష్టం చేశారు. ఐడీబీఐ పునర్వ్యవస్థీకరణలో అన్ని నియమ నిబంధనలు కచ్చితంగా పాటించామని వివరించారు.
కాంగ్రెస్ హయాంలో సామాన్య పౌరులకు, పలుకుబడి ఉన్నవారికి భిన్నమైన నియమావళి ఉండేదని, ఆ శకం ముగిసిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సామాన్య ప్రజలకు రుణాలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, ఫోన్ కాల్స్‌తో రుణాలు ఇవ్వాలని ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి లేదని తేల్చిచెప్పారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వం, ఎల్ఐసీకి ఉన్న 60.72 శాతం మెజారిటీ వాటాను రూ.52,878 కోట్లకు విక్రయించేందుకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 14న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
Don’t receive OTP? Resend