‘నీట్ పేపర్ మళ్లీ లీక్’ ప్రచారం ఫేక్
నీట్ ప్రశ్నపత్రం మళ్లీ లీక్ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టింది. నీట్ రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రం కూడా లీక్ అయినట్టుగా కొందరు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. నీట్ పరీక్షకు సంబంధించి ఏదైనా అధికారిక సమాచారం కోసం neet.nta.nic.in వెబ్సైట్ను సందర్శించి చెక్ చేసుకోవాలని సూచించింది.
Login
Comments (0)