Video: కాకినాడ జేఎన్టీయూ లో "హాలో లోకేష్" పేరిట విద్యార్థులతో ముఖాముఖి
కాకినాడ: అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ వన్ గా ఉంచాలన్నదే మా లక్ష్యం, అందులో విద్యార్థులంతా భాగస్వాములయ్యేలా మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం, ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూలో హలో లోకేష్ పేరిట నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలిచ్చారు. కార్యక్రమానికి జేఎన్టీయూ ఈసిఇ మూడో సంవత్సరం విద్యార్థిని ప్రాప్తి సంధానకర్తగా వ్యవహరించారు.
Login
Comments (0)