రేపు భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇది గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా రూ.17,900 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. 13 వేల మంది గిరిజన విద్యార్థుల ధింసా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Login
Comments (0)