అమెరికాలో హెచ్1బీ వీసాల నిబంధనలను ఉల్లంఘించే సంస్థలకు కఠిన శిక్షలు ఖరారు చేసే దిశగా రిపబ్లికన్ పార్టీ సభ్యులు నూతన బిల్లును ముందుకు తెచ్చారు. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభలో అధికారికంగా ఒక బిల్లును ప్రవేశపెట్టారు. నిబంధనలను అతిక్రమించి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే కంపెనీలకు గరిష్ఠంగా 2.5 లక్షల డాలర్ల వరకు జరిమానా విధించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.
జరిమానాతో సరిపెట్టకుండా బాధ్యతారహితంగా వ్యవహరించే సంస్థలపై పదేళ్ల పాటు వీసాల జారీపై నిషేధం విధించాలని కూడా పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో నకిలీ పత్రాలను సృష్టించి మోసాలకు పాల్పడేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ బిల్లు ద్వారా ప్రతిపాదించారు. అమెరికా వీసా నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసే లక్ష్యంతో ఈ తాజా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Don’t receive OTP? Resend