ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్
స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో తొలిసారిగా బెంగళూరులో ఆగస్టు 15కు ముందే ఈ సేవలను ప్రారంభించేందుకు రెస్టారెంట్ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఇతర సంస్థలు వసూలు చేస్తున్న 16-30 శాతం కమీషన్‌తో పోలిస్తే కేవలం 10 శాతం కమీషన్‌తో రెస్టారెంట్లను ఆకర్షించేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తోంది.
Login
Comments (0)