ఏపిలో రాయితీ ధరకు సన్నబియ్యం విక్రయాలు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా 130 రైతుబజార్లు, 500 రైస్‌మిల్లుల ద్వారా రాయితీ ధరకు సన్నబియ్యం విక్రయాలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.52కు, బీపీటీ రా రైస్‌ను రూ.50కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆధార్ ధ్రువీకరణతో ఒక్కో వినియోగదారుడు గరిష్ఠంగా 10 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్‌ను కూడా తక్కువ ధరకు అందించేందుకు కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
Login
Comments (0)