విజయవాడలో మారుతున్న ఆహారపు అలవాట్లు
అమరావతి: విజయవాడ వాసుల్లో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. భోజనంలో చికెన్ బిర్యానీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఫుడ్ ఆర్డర్ల సంస్థ స్వీగ్గీ ఇచ్చిన వివరాల ప్రకారం, ఆ సంస్థకు వచ్చిన ఫుడ్ ఆర్డర్లలో 7.78 లక్షల ఆర్డర్లతో చికెన్ బిర్యానీ తొలిస్థానంలో నిలిచింది. 3.2 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ రెండో స్థానంలో, 2.7 లక్షల ఆర్డర్లతో వెజ్ దోశ 3వ స్థానంలో నిలిచాయి.ఉదయం వేళల్లో వచ్చిన ఆర్డర్లలో సింహ భాగం ఇడ్లీదే. 1.43 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ అగ్రస్థానంలో నిలవగా, తర్వాతి స్థానంలో 1.12 లక్షల ఆర్డర్లతో వెజ్ దోశ నిలిచింది. అర్ధరాత్రి ఆర్డర్లు ఇచ్చే సంస్కృతి విజయవాడలో వేగంగా విస్తరిస్తోందని స్విగ్గీ ఆ నివేదికలో పేర్కొంది
Login
Comments (0)