మూడేళ్ల క్రితం ఇదే రోజు నంద్యాలలో మీటింగ్ నుంచి వస్తుంటే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని మాచవరంలో నిర్వహించిన మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నోటీసులు కూడా ఇవ్వకుండా తనను అరెస్టు చేసి 53 రోజులు రాజమహేంద్రవరం జైలులో పెట్టారని చంద్రబాబు తెలిపారు. తాను జైలులో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ వచ్చి కలిశారని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆయన తనకు అండగా నిలిచారని ప్రశంసించారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలనే ఆలోచనతోనే తాను కుటుంబ వ్యాపారాన్ని ఏర్పాటు చేశానని చెప్పారు.
తనకు సంపాదన, డబ్బుపై ఎలాంటి ఆశ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Don’t receive OTP? Resend