భారత్ టాక్సి యాప్ ను ప్రారంభించిన కేంద్రం
ఢిల్లీ: ప్రైవేటురంగ ట్యాక్సీ కంపెనీలు ఓలా, ఉబర్, ర్యాపిడోకు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీ (Bharat Taxi) పేరిట కొత్త యాప్ను తీసుకొచ్చింది. కేంద్రమంత్రి అమిత్ షా గురువారం ఈ యాప్ను ప్రారంభించారు. తొలుత ఢిల్లీ-రాజధాని ప్రాంతం, గుజరాత్ రాష్ట్రాల్లో సేవలు లభిస్తాయి. రాబోయే మూడేళ్లలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య (అస్సాం) వరకు భారత్ ట్యాక్సీ సేవలను తీసుకొస్తామని అమిత్షా పేర్కొన్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా కార్లు, త్రీవీలర్లు, టూవీలర్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
Login
Comments (0)