కేంద్రం-సీజేపీ చర్చలు.. మంత్రి తొలగింపుపై పట్టుదల
కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు జరిగాయి. తటస్థ వేదికలో సమావేశం నిర్వహించాలన్న సీజేపీ డిమాండ్‌ను కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. నీట్ పరీక్ష అక్రమాలపై కఠిన చర్యల్లో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని సీజేపీ మరోసారి డిమాండ్ చేసింది.
Login
Comments (0)