సమాచార హక్కు పరిధిలోకి బిసిసిఐ రాదు
బీసీసీఐ అనేది ఆర్టీఐ పరిధిలోకి రాదని కేంద్ర సమాచార కమిషన్ వెల్లడించింది. అది ప్రభుత్వ యాజమాన్యంలో లేదని, ప్రభుత్వం నుంచి దానికి నిధులు అందవని
స్పష్టం చేసింది. బిసిసిఐ అవలంబించే నిబంధనలు, అధికారాలకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ దాఖలైన అప్పీల్‌ను కమిషన్ కొట్టివేసింది. బీసీసీఐ ప్రజా అధికార సంస్థ అని, ప్రజా సమాచార అధికారులను నియమించాలని 2018లో అప్పటి సమాచార కమిషనర్ ఎం. శ్రీధర్ ఆచార్యులు బోర్డును ఆదేశించారు. ఈ అంశంపై మళ్లీ విచారణ చేపట్టాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర సమాచార కమిషన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సీఐసీ, బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదని తేల్చింది.
Login
Comments (0)