ఏపీ అప్పు రూ.6.45 లక్షల కోట్లకు చేరిక
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 2026 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.6,45,461 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. 2024లో రూ.4,92,568 కోట్లు, 2025లో రూ.5,65,534 కోట్లుగా అప్పు నమోదైనట్లు వెల్లడించారు. 2024తో పోలిస్తే 2025లో 14.81 శాతం, 2025తో పోలిస్తే 2026లో 14.13 శాతం మేర అప్పు పెరిగినట్లు వివరించారు.
Login
Comments (0)