తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అన్నా లెజినోవా
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన చేరుకున్న ఆమె ముందుగా శ్రీవరాహస్వామిని దర్శించుకుని, అనంతరం ప్రత్యేక ప్రవేశ దర్శనంలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పవన్ కల్యాణ్ భుజానికి ఇటీవల శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిన నేపథ్యంలో ఆమె మొక్కు తీర్చుకున్నట్లు సమాచారం. శనివారం కూడా శ్రీవారి సేవలో పాల్గొననున్నారు.
Login
Comments (0)