కాకినాడ: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల కాకినాడ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం, శ్రీపాదవల్లభ మహాసంస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి, పురుహుతిక అమ్మవారు, దత్తాత్రేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ద్రాక్షారామలోని శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
Don’t receive OTP? Resend