అయోధ్యలో సైట్ కొనుక్కున్న రణ్ బీర్ కపూర్
బాలీవుడ్ నటుడు రణ బీర్ కపూర్ అయోధ్యలో భారీ స్థలాన్ని కొనుగోలు చేశారు. హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) అభివృద్ధి చేస్తున్న “ది సరయూ” ప్రాజెక్టులో 2,134 చదరపు అడుగుల స్థలాన్ని సుమారు రూ.3.31 కోట్లకు ఆయన తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. సరయూ నది తీరంలో 75 ఎకరాల్లో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టులో క్లబ్ హౌస్, లైఫ్ స్టైల్ సదుపాయాలు, ది లీలా నిర్వహించే లగ్జరీ హోటల్ ఉండనున్నాయి. త్వరలో తెరకెక్కనున్న ‘రామాయణ’ చిత్రంలో శ్రీరాముడి పాత్ర పోషించనున్న రణబీర్ కపూర్, “అయోధ్య నన్ను పిలిచింది, నేను ఆ పిలుపుకు స్పందించాను” అని వ్యాఖ్యానించారు.
Login
Comments (0)