7.83 లక్షల మంది భక్తులు వైకుంఠద్వార దర్శనం
తిరుమల: ఈ ఏడాది రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తితిదే కల్పించిన ఏర్పాట్లపై 93 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ‘‘2023లో 6.47 లక్షల మంది, 2024లో 6.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి లక్ష మంది భక్తులు అధికంగా దర్శనం చేసుకున్నారు. 10 రోజుల్లో రూ.41 కోట్లు హుండీ ఆదాయం సమకూరింది,” అని చెప్పారు.
Login
Comments (0)