గోదావరి పుష్కరాలకి 10 కోట్ల మంది వచ్చే అవకాశం
అమరావతి: కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని, ఇందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్నందున పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని సూచించారు. గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్దేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.
Login
Comments (0)