ఏపిలో కారవాన్ టూరిజానికి శ్రీకారం
కారవాన్లో పుణ్యక్షేత్రాలను సందర్శించే కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రీకారం చుట్టారు. భక్తుల కోసం సకల సౌకర్యాలతో రూపొందించిన కారవాన్ ను సోమవారం నెల్లూరులో ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ వాహనాలను ప్రారంభించి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను టూరిజం సర్క్యూట్లుగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారని వివరించారు.
Login
Comments (0)