తెలంగాణలో ఇక నుంచి షో రూంలోనే వాహనాల రిజిస్ట్రేషన్ సౌకర్యం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వాహన కొనుగోలుదారులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అమలులోకి వచ్చింది. వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యే నూతన విధానం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. జనవరి 8న రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన విధానంపై విధానపరమైన నిర్ణయం తీసుకోగా, రవాణాశాఖ అధికారులు ఇందుకు అవసరమైన సాంకేతిక సదుపాయాలు, సాఫ్ట్వేర్ను సిద్ధం చేసి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ షోరూంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా, అది పూర్తిగా విజయవంతమైంది.
Login
Comments (0)