విజయవాడ: నగరంలో నేటి నుంచి ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు వేడుకలు సాగనున్నాయి. సినీ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఉత్సవాల్లో భాగంగా కృష్ణా నదిలో కేరళ తరహా ఫ్లోటెడ్ హౌస్బోట్లను పున్నమిఘాట్ వద్ద సీఎం ప్రారంభించనున్నారు.
Don’t receive OTP? Resend