వైసిపి హయాంలో ఫేస్బుక్లో కామెంట్ పెట్టినందుకు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అనుచరులు తనను చిత్రహింసలకు గురిచేశారని రాజంపేటకు చెందిన పత్తి మణి ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, మూడేళ్ల క్రితం తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, ఇటీవల కూడా చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ఈ కేసులో భూమన కరుణాకరరెడ్డి, అభినయరెడ్డిలను ఏ1, ఏ2గా చేర్చి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Don’t receive OTP? Resend